| Daily భారత్
Logo




సెంచరీ వైపు పరుగులు పెడుతున్నా టమాటా ధర

News

Posted on 2024-06-14 08:23:26

Share: Share


సెంచరీ వైపు పరుగులు పెడుతున్నా టమాటా ధర

డైలీ భారత్, తెలంగాణ: హైదరాబాద్లోని మార్కెట్లలో నాణ్యమైన మొదటి రకం టమాటా ధర రూ. రూ.80-90 వరకు పలుకుతోంది.రెండో రకం టమాటాను రూ.60-70కి అమ్ముతున్నారు. అటు హోల్సేల్ మార్కెట్లలో రూ.120కి మూడు కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. మరోవైపు ఉల్లిపాయల ధర కూడా భారీగా పెరిగింది. కేజీ ఉల్లి రేట్ రూ.50-60 పలుకుతోంది. టమాటా, ఉల్లి రేట్లతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. దేశంలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్దిరోజులు పెరుగుతున్న ఉల్లి ధరలు.. కొనేముందే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉల్లి సరఫరా తక్కువగా ఉండటమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.దేశంలో ఉల్లిని ఉత్పత్తి చేసే అగ్రగామి రాష్ట్రమైన మహారాష్ట్రలో కరువు వంటి పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో లోటు ఉందని చెబుతున్నారు. దీంతో దేశంలో గత రెండు వారాలలో ఉల్లి ధరలు 30 నుంచి 50 శాతం పెరిగాయి. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు ఉల్లిని నిల్వ చేసి.. ధరలు మరింతగా పెరిగేలా చేస్తున్నారని, అలా ధరలు పెరిగిన తర్వాత అమ్ముకోవాలని చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. 

హైదరాబాద్‌లో ఉల్లిపాయల ధరల విషయానికి వస్తే.. రిటైల్ ధర సుమారు 25 శాతం, హోల్‌సేల్ ధర 15 శాతం పెరిగింది. ఏడాది క్రితం ఉల్లి రిటైల్‌ ధరలు కిలో రూ. 20 ఉండగా.. హోల్‌సేల్‌ ధర క్వింటాల్‌కు రూ.1,581.97గా ఉంది. ప్రస్తుతంరిటైల్ ధరలు కిలోకు రూ. 40 నుంచి రూ. 50 మధ్య ఉంది. ఒక నెల క్రితం ఉల్లి కిలో ధర రూ.20 నుంచి రూ.30 వరకు ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. అయితే జూన్ 17న బక్రీద్‌ నేపథ్యంలో ఉల్లిపాయలకు దేశీయంగా భారీ డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. 

మరోవైపు సెప్టెంబరు, అక్టోబరు వరకు కొత్త ఖరీఫ్ పంట చేతికి వచ్చే అవకాశం లేకపోవడంతో ఉల్లి కిలో రూ.50 నుంచి రూ.60 దాటవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక, దేశంలోని ఉల్లిలో 42 శాతానికి పైగా ఉత్పత్తి చేసే మహారాష్ట్ర.. తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో 15 నుంచి 20 శాతం తగ్గుదలని చవిచూసింది. మహారాష్ట్రలోని 27 జిల్లాలలో 20 నుంచి 45 శాతం వరకు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొన్నాయని గణంకాలు సూచిస్తున్నాయి.

Image 1

2003 DSC ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ మహా విజ్ఞాపన సభకు టీపీటీఫ్ పూర్తి మద్దతు

Posted On 2026-03-05 22:09:37

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయా అభివృద్ధికి కృషి చేస్తా సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి

Posted On 2026-03-05 22:08:10

Readmore >
Image 1

ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో బి పాజిటివ్ రక్తం అందజేత

Posted On 2026-03-05 22:07:03

Readmore >
Image 1

శీర్షిక: మంజుల అనే నేను

Posted On 2026-03-05 22:05:42

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి

Posted On 2026-03-05 22:00:22

Readmore >
Image 1

కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్

Posted On 2026-03-05 21:59:32

Readmore >
Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >