Posted on 2024-06-13 19:26:45
ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ మంత్రులు సబితా, నిరంజన్ రెడ్డి, మహ్ముద్ ఆలీ
శ్రద్ధాసక్తులతో ప్రజాసేవ చేస్తా : ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ రెడ్డి.తెలంగాణా రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ఎదుట గురువారం ఉదయం ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి నవీన్ కుమార్ రెడ్డి సతీమణి లక్ష్మి తదితర కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, మహమ్మద్ అలీ తదితరులు హాజరయ్యారు. నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిపించిన పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని ఈ అవకాశం అందించిన భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు తదితరులకు అండదండగా ఉంటానని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రతిష్టకు పాటుపడతానని పేర్కొన్నారు. తనపై పెట్టిన గురుతరమైన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతానని పాలమూరు జిల్లా అభ్యున్నతికి, అభివృద్ధికి దోహదపడతానని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, స్థానిక ఎంపీటీసీలు, జెడ్పిటిసిలు, కౌన్సిలర్లు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >