| Daily భారత్
Logo




పింఛన్ పెంపు ఏమయే 100 రోజుల్లోనే ఇస్తామని 6నెలలైనా ఊసెత్తని కాంగ్రెస్

News

Posted on 2024-06-13 13:16:40

Share: Share


పింఛన్ పెంపు ఏమయే 100 రోజుల్లోనే ఇస్తామని 6నెలలైనా ఊసెత్తని కాంగ్రెస్

డైలీ భారత్, తెలంగాణ: రెండువేల రూపాయలు ఉన్న పింఛన్‌ను నాలుగువేలకు పెంచి ఇస్తం అని ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కారు, అమలుపై ఎలాంటి శ్రద్ధ పెట్టినట్టు కనిపించడం లేదు

44 లక్షల మందికిపైగా లబ్ధిదారులు 

దివ్యాంగులు దాదాపు 5 లక్షల మంది

రెండువేల రూపాయలు ఉన్న పింఛన్‌ను నాలుగువేలకు పెంచి ఇస్తం అని ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కారు, అమలుపై ఎలాంటి శ్రద్ధ పెట్టినట్టు కనిపించడం లేదు

వందరోజుల్లోనే హామీని అమలు చేస్తామని చెప్పి ఆరు నెలలు గడుస్తున్నా ఊసెత్తడం లేదు. ఎప్పుడెప్పుడు పెరిగిన పింఛను అందుకుందామా? అని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తుంటే పాతపద్ధతిలోనే పైసలు వేసి చెయ్యి చ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తున్నది.

ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.2 వేల పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతామని కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ప్రకటించింది. రూ.4వేలు ఉన్న దివ్యాంగుల పింఛన్‌ను రూ.6వేలకు పెంచుతామని చెప్పింది. ఈ హామీలను 100 రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పి ఇప్పటికి 180 రోజులైంది. రాష్ట్రంలో అన్నిరకాల పింఛన్ల లబ్ధిదారులు మొత్తం 44లక్షల మంది ఉన్నారు. వీరంతా పెరిగిన పింఛన్‌ ఎప్పుడు అందుతుందా? అని ఎదురుచూస్తున్నారు. వీరిలో దాదాపుగా ఐదు లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. మిగతావారిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, గౌడ, హెచ్‌ఐవీ, బోధకాలు బాధితులు, డయాలసిస్‌ రోగులు ఉన్నారు

నిరాటంకంగా ఇచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

సమాజంలో నిస్సహాయులుగా ఉన్న వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే మొదట పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచి అందించింది. రెండో టర్మ్‌లో 2,000కు పెంచింది. 2014 నవంబర్‌లో ఆసరా పెన్షన్‌ పథకాన్ని ప్రారంభించి కరోనా లాంటి కష్టకాలంలోనూ నిరాటంకంగా అందించింది. ప్రారంభంలో వృ ద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, హెచ్‌ఐవీ బాధితులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు పింఛన్లు అందజేసింది. 2015 మార్చి బీడీ కార్మికులకు, 2017 ఏప్రిల్‌ నుంచి ఒంటరి మహిళలకు, 2018 ఏప్రిల్‌ని ఫైలేరియా బాధితులకు, 2022 ఆగస్టు నుంచి డయాలసిస్‌ పేషెంట్లకు పింఛన్లను వర్తింపజేసింది. త్వరలోనే పింఛన్ల చెల్లింపునకు సిద్ధమవున్న కాంగ్రెస్‌ ప్రభు త్వం, పాత విధానంలోనే వెళ్లేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. 44లక్షల మంది లబ్ధిదారులకు పింఛను ఇ వ్వాలంటే నెలకు సగటున వెయ్యి కోట్ల చొప్పున ఖర్చవుతుందని, ఇప్పుడా మొత్తా న్ని రెట్టింపు చేయడం వల్ల మరో వెయ్యి కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. కొత్తగా అసరా పింఛను కోసం ప్రజాపాలనలో చేసిన దరఖాస్తులన్నీ అటకెక్కినట్టు తెలుస్తున్నది. ఉన్న పింఛన్లను పెంచి ఇవ్వడంపైనే దృష్టిపెట్టని ప్రభుత్వం, కొత్తవి ఎలా ఇస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవం

Posted On 2026-03-04 19:28:49

Readmore >
Image 1

కన్నకొడుకు గెంటేశాడు.. జిల్లా కలెక్టర్ కొడుకులా కాపాడారు..

Posted On 2026-03-04 18:36:56

Readmore >
Image 1

మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-03-04 18:30:50

Readmore >
Image 1

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు

Posted On 2026-03-04 16:19:10

Readmore >
Image 1

38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్

Posted On 2026-03-04 16:16:19

Readmore >
Image 1

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

Posted On 2026-03-04 15:50:03

Readmore >