| Daily భారత్
Logo


అమిత్ షా డీప్‌ ఫేక్ వీడియో కేసులో నలుగురు తెలంగాణ వారే

News

Posted on 2024-04-29 18:26:08

Share: Share


అమిత్ షా డీప్‌ ఫేక్ వీడియో కేసులో నలుగురు తెలంగాణ వారే

డైలీ భారత్, హైదరాబాద్: ఏప్రిల్ 29: కేంద్ర మంత్రి అమిత్‌ షా డీప్‌ ఫేక్ వీడియో అంశం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను వైరల్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు గాంధీభవన్‌కు చేరుకున్నారు. 91 కింద నోటీసులు ఇస్తామని గాంధీభవన్ సిబ్బందికి అధికారులు తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 10 మందికి నోటీసులు ఇవ్వగా అందులో నలుగురు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన మన్నె సతీష్, నవీన్, శివకుమార్, తస్లీమలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

కాగా.. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని కేంద్రమంత్రి అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను కాంగ్రెస్ వైరల్ చేసింది. దీనిపై బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ (IFSO) దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే గాంధీభవన్‌కు వచ్చిన ఢిల్లీ పోలీసులు.. సోషల్ మీడియా ఇంచార్జ్‌కు నోటీసులు ఇచ్చారు. మరోవైపు డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని కర్ణాటక సభలో ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. కేపీ

Image 1

నేడు తెలంగాణ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు

Posted On 2024-05-16 09:07:38

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2024-05-15 19:01:12

Readmore >
Image 1

కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్

Posted On 2024-05-15 13:52:23

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా

Posted On 2024-05-15 13:42:59

Readmore >
Image 1

తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్

Posted On 2024-05-15 11:32:10

Readmore >
Image 1

కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు

Posted On 2024-05-15 10:33:33

Readmore >
Image 1

ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

Posted On 2024-05-14 22:33:34

Readmore >
Image 1

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

Posted On 2024-05-14 20:59:56

Readmore >
Image 1

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి

Posted On 2024-05-14 20:54:19

Readmore >
Image 1

తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్

Posted On 2024-05-14 18:54:45

Readmore >