| Daily భారత్
Logo


ఎనమిది సంవత్సరాల క్రితం తప్పిపోయిన మహిళ : కుటుంబ సభ్యుల దరికి చేర్చిన ఇల్లంతకుంట పోలీసులు

News

Posted on 2024-04-29 19:57:18

Share: Share


ఎనమిది సంవత్సరాల క్రితం తప్పిపోయిన మహిళ : కుటుంబ సభ్యుల దరికి చేర్చిన ఇల్లంతకుంట పోలీసులు

డైలీ భారత్, ఇల్లంతకుంట: ఖమ్మం జిల్లాకు చెందిన మతిస్థిమితం లేని గుర్తు తెలియని మహిళను ఈ రోజు వారీ కుటుంబ సభ్యులను గుర్తించి వారికి సమాచారం అందించి సోమవారం రోజున వారికి అప్పజెప్పడం జరిగిందని ఇల్లంతకుంట ఎస్.ఐ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్.ఐ రాజు మాట్లాడుతూ....తేదీ 28-4-2024 రోజున రాత్రి సమయంలో గాలిపల్లి గ్రామంలో ఒక గుర్తుతెలియని మహిళ వచ్చినదని ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ కి డయల్ 100 కాల్ రాగా వెంటనే ఇల్లంతకుంట ఎస్.ఐ బ్లూ కోర్ట్ సిబ్బందిని గాలిపల్లి గ్రామానికి పంపించగా అక్కడ గుర్తు తెలియని మహిళ ఉండగా ఆమెను విచారించగా తన పేరు దోమల రాములమ్మ భర్త పుల్లయ్య అని తెలిపినది ,వెంటనే ఆమెను సిరిసిల్లలోని సఖీ సెంటర్ కు పంపించడం జరిగింది. 

సోమవారం రోజున మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొనగా కిష్టాపూర్ గ్రామం ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా వాసి అని తెలిపినది వెంటనే ఇల్లంతకుంట ఎస్సై ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ వారికి మరియు కిష్టాపూర్ గ్రామ పెద్దలకు ఇట్టి విషయం తెలుపగా ఆమె కూతురైన రమాదేవికి గుర్తు తెలియని మహిళ తన తల్లిగా గుర్తించి తన తల్లి ఎనిమిది సంవత్సరాల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయినదని ఆమెకు మతిస్థిమితం సరిగా ఉండదని , తన తల్లి కోసం గత 8 సంవత్సరాల నుండి వెతుకుతున్నామని తెలిపినది. సోమవారం రోజున  రమాదేవి సిరిసిల్ల సఖి సెంటర్ కు వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళిందని ఇల్లంతకుంట ఎస్.ఐ రాజు తెలిపారు.

8 సంవత్సరాల క్రితం తప్పిపోయిన తన తల్లిని తమకు అప్పజెప్పిన ఇల్లంతకుంట పోలీస్ వారికి సఖి సెంటర్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Image 1

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

Posted On 2024-05-16 17:38:06

Readmore >
Image 1

ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి

Posted On 2024-05-16 14:12:24

Readmore >
Image 1

అలిపిరి వద్ద కారు దగ్ధం

Posted On 2024-05-16 13:34:02

Readmore >
Image 1

భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య

Posted On 2024-05-16 09:54:06

Readmore >
Image 1

నేడు తెలంగాణ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు

Posted On 2024-05-16 09:07:38

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2024-05-15 19:01:12

Readmore >
Image 1

కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్

Posted On 2024-05-15 13:52:23

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా

Posted On 2024-05-15 13:42:59

Readmore >
Image 1

తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్

Posted On 2024-05-15 11:32:10

Readmore >
Image 1

కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు

Posted On 2024-05-15 10:33:33

Readmore >