| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

చిన్నగూడూర్ మండలంలోని మేగ్య తండా లో ఘనంగా ఎల్లమ్మ తల్లి పండుగ

డైలీ భారత్, చిన్నగూడూర్: చిన్నగూడూర్ మండలంలోని మేగ్య తండాలో ఎల్లమ్మ తల్లి పండుగ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ పాల్గొని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని సంస్కృతులలోను సామాన్యంగా కనిపించే లక్షణం మాతృ ఆరాధనం, ప్రకృతిని జగన్మాతగా ఆరాధించే ఈ లక్షణం మానవ సభ్యత వికాసక్రమంలో తొలిదశ అని చెప్పవచ్చు. అమ్మ ప్రకృతి అసలు అమ్మ ఆగ్రహిస్తే ధరాతలమే దద్దరిల్లుతుంది.అందుకే ఎల్లమ్మ తల్లి పండుగ గ్రామీణులు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు అని తెలిపారు.

Previous తీహార్ జైలుకు బాంబు బెదిరింపు
Next కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు
ADVERTISEMENT