డైలీ భారత్, న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీహార్ జైలుకు మంగళవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే జైలు అధికారులు ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులకు తెలిపారు. తమకు ఇ-మెయిల్ కూడా వచ్చినట్లు జైలు అధికారులు వెల్లడించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అక్కడకు చేరుకున్నారు. తీహార్ జైలు అంతటా క్షుణ్ణంగా గాలించారు. అయితే వారికి అనుమానాస్పద పేలుడు పదార్థాలు లభించలేదు. ప్రస్తుతం అక్కడ సోదాలు కొనసాగుతున్నాయి.
News