| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జీలం నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి

జీలం నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి

డైలీ భారత్, జమ్ము కాశ్మీర్: జమ్ముకశ్మీర్‌లోని జీలం నదిలో విద్యార్థులు కూలీలు  ప్రయాణిస్తున్న ప్యాసింజర్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు అధి కారులు గుర్తించారు.

గుండ్‌బాల్ బట్వారా ప్రాంతంలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక గల్లంతైన వారి మృతదేహాల కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలింపు చర్యలు చేపట్టాయి.

మరో వైపు కశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జీలం నది ‎ఉధృతంగా ప్రవహిస్తుం డడంతో సాధారణ జనజీవనం స్తంభించి పోయింది.

అయితే గుండ్‌బాల్‌ను శ్రీనగర్‌ను కలిపే బ్రిడ్జి గత దశాబ్ద కాలంగా నిర్మాణంలో ఉందని, దీంతో స్థానిక ప్రజలు నదిని దాటాలంటే పడవలను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు.

బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు వాపోతున్నారు.

Previous అయోధ్య లో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ రామ నవమి వేడుకలు
Next శ్రీరామ నవమి కి ముస్తాబవుతున్న భద్రాది రామయ్య
ADVERTISEMENT