డైలీ భారత్, అయిటిపాముల: అధికారంలోకి వచ్చాక దేశంలోని నిరుపేదలకు అప్పటిదాకా బ్యాంకు మెట్లు కూడా ఎక్కని నిరుపేదలకు జీరో ఖాతా ద్వారా 50 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించిన ఘనత నరేంద్ర మోడీకి దక్కిందని బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ అన్నారు సోమవారం ఉదయం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో 15 వరోజు బీజేపీ లాబార్ది సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను కలుసుకున్నారు స్వచ్ఛ భారత్ పథకం ద్వారా 12కోట్ల మంది కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడడమే కాకుండా వారికి 33శాతం రిజర్వేషన్ లు కల్పించిన మోదీ ప్రభుత్వానికి జరుగబోయే ఎన్నికల్లోతిరుగులేదు అని గోలి ప్రభాకర్ తెలిపారు మోదీ పరిపాలనకు ముందు దేశాన్ని చూడండి మోదీ వచ్చిన తరువాత దేశాన్ని చూడండి అని ప్రజలు తేడా గమనించారాని రాష్ట్రంలో అత్యధిక సీట్లను బీజేపీకి కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో గోలి మహేశ్వరి శ్రీనాథ్ నాగరాజు నవీన్ తదితరులు పాల్గొన్నారు
News
సబ్కా సాత్ సబ్కా వికాస్ అజెండాతో ముందుకు వెళ్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం : గోలి ప్రభాకర్ బీజేపీ