| Daily భారత్
Logo




తల్లితో గొడవపడుతున్న నానమ్మను పొడిచేసిన బాలుడు

News

Posted on 2024-04-15 07:38:03

Share: Share


తల్లితో గొడవపడుతున్న నానమ్మను పొడిచేసిన బాలుడు

తల్లితో గొడవపడుతున్న నానమ్మను పొడిచేసిన 14 ఏళ్ల బాలుడు.. జనగామ జిల్లాలో దారుణం

పదేళ్ల క్రితం భర్తను కోల్పోయిన అత్తమామల వద్దే ఉంటున్న కోడలు

అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవలు

శనివారం రాత్రి మరోమారు గొడవ

అది చూసి నానమ్మ చాతీలో కత్తితో పొడిచిన మనవడు

పరారీలో ఉన్న బాలుడి కోసం పోలీసుల గాలింపు

డైలీ భారత్, జనగామ: తల్లితో తరచూ గొడవ పడుతోందన్న కారణంతో 14 ఏళ్ల బాలుడు నానమ్మను కత్తితో పొడిచి చంపేశాడు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలోని ఉప్పుగల్లులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. పదేళ్ల క్రితం కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి అతడి భార్య తన ఇద్దరు కుమారులతో అత్తమామల వద్దే ఉంటోంది. 

ఇటీవల తరచూ అత్తమామలతో గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. ఇది చూసిన మనవడు (14) నానమ్మపై కోపంతో కత్తితో ఆమె చాతీలో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఆమెను హనుమకొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న బాలుడి కోసం గాలిస్తున్నారు.

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >