| Daily భారత్
Logo




బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా: బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలి - తీగల శేఖర్ గౌడ్

News

Posted on 2024-04-14 11:36:58

Share: Share


బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా: బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలి - తీగల శేఖర్ గౌడ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్  అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అన్నారు.డా బీ,ఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప దిశా నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిన మహనీయుడు అంబేద్కర్‌ అని కొనియాడారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు రిజర్వేషన్లు పొందుతున్నామన్నారు. 1982 అన్న నందమూరి తారకరామారావు గారు మహత్మా జ్యోతిరావు పూలే,అంబేద్కర్ గార్ల ఆశయ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు.సామాన్యులకు ప్రభూత్వ పలాలు అందాలనే ఉద్దేశ్యం తో రాజ్యాంగ బద్దంగా మాండలిక వ్యవస్థ ను ఏర్పాటు చేసారని ఈ సందర్భంగా గుర్తు చేసారు.బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచారన్నారు.ఈ కార్యక్రమంలో టీ,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి,పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బింగి వెంకటేశం,తంగళ్లపెళ్లి ప్రధాన కార్యదర్శి పంజా బాలరాజు,ఆరే మల్లేశం, నవీన్ తదితరులు పాల్గొన్నారు...

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >