Posted on 2024-04-06 23:29:12
నేతన్న గర్జన సభ విజయవంతం - సిరిసిల్ల ఉరిసిల్లగా మారే ప్రమాదం ఉంది ప్రభుత్వం ఆదుకోవాలి
వస్త్ర పరిశ్రమ సంఘాల ఐక్యవేదిక జేఏసీ
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ఆదుకోవాలని కోరుతూ పట్టణంలోని కాలేజీ గ్రౌండ్ లో నేతన్న గర్జన సభను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంఘాల ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నేత కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ గత మూడు నెలల నుండి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుందని నేత కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని దుర్భర పరిస్థితులు సిరిసిల్ల నేత కార్మికులు అనుభవిస్తున్నారని, నేత కార్మికుల ఆత్మహత్యలతో మళ్ళీ సిరిసిల్ల ఉరిసిల్లగా మారే ప్రమాదం ఉందని వెంటనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ఆదుకొని బతుకమ్మ చీరల ఆర్డర్లను ఇప్పించి, బకాయి ఉన్న బిల్లులను విడుదల చేయాలని వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని లేనిచో త్వరలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో చనిపోయిన నేత కార్మికునికి నివాళులర్పించి మౌనం పాటించారు.
ఈ సభలో సిరిసిల్ల పట్టణములోని నేత కార్మికులు నేత కార్మిక కుటుంబాలు,ఆసాములు, యజమానులు పాల్గొన్నారు..
నిజాంసాగర్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
Posted On 2026-03-07 11:49:37
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-07 11:48:19
Readmore >
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన ట్రస్ట్‌కు రూ.2 లక్షల విరాళం
Posted On 2026-03-07 07:38:45
Readmore >
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి
Posted On 2026-03-06 23:23:50
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-06 23:21:29
Readmore >
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు
Posted On 2026-03-06 23:19:11
Readmore >
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
Posted On 2026-03-06 20:44:04
Readmore >
మంచినేనిపేట : 23 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి
Posted On 2026-03-06 20:36:31
Readmore >
భద్రాచలంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ 287వ జయంతి వేడుకలు
Posted On 2026-03-06 20:11:17
Readmore >