| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తిరుపతిరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్

తిరుపతిరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో ; తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కలిసి ఆసుపత్రికి వెళ్లారు. 

గురువారం తిరుపతి రెడ్డికి హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్‌లోని మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్ శరత్ తో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తిరుపతిరెడ్డి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తిరుపతి రెడ్డ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Previous కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా అనౌన్స్
Next యువకుడి దారుణ హత్య
ADVERTISEMENT