జగిత్యాల జిల్లాలో
డైలీ భారత్, జగిత్యాల జిల్లా: పండగ పూట జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాయికల్ మండల పరిధిలోని తాట్లవాయి గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగేల్లి సురేష్‌ను కొందరు దుండ గులు మాస్క్ వేసుకుని వచ్చి గొడ్డలితో అతి కిరాతకంగా దాడి చేసి నరికి చంపారు. అనంతరం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో డెడ్‌బాడీని పడేసి వెళ్లారు.
గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలిం చారు. కుటుంబ సభ్యల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తును ప్రారంభించారు.
అయితే, సురేష్‌కు ప్రత్య ర్థులు ఎవరైనా ఉన్నారా.. లేక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే విషయం పోలీసుల విచారణలో తేలనుంది..