| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇరిగేషన్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు... బయటపడింది 7 కోట్ల ఆస్తులు! 50 తులాల బంగారం, 5 కార్లు!

ఇరిగేషన్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు... బయటపడింది 7 కోట్ల ఆస్తులు! 50 తులాల బంగారం, 5 కార్లు!

డైలీ భారత్, హైదరాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా ఇరిగేషన్ & CAD శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ రాగిరి సత్యనారాయణపై అక్రమాస్తుల కేసు నమోదైంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ (ACB) కేసు నమోదు చేసింది.

రంగారెడ్డి జిల్లా, కర్మాన్‌ఘాట్, మాదవరం సెరినిటీ, ఫ్లాట్ నం. 704, బి బ్లాక్, 7వ అంతస్తులో నివసిస్తున్న ఆయన సర్వీసులో అవినీతి, అక్రమ మార్గాల ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఏసీబీ తెలిపింది.

అవినీతి నిరోధక చట్టం 1988 (2018లో సవరించబడింది) సెక్షన్ 13(1)(b) మరియు 13(2) ప్రకారం నేరంగా పరిగణించి, నవంబర్ 12, 2026న ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర అనుచరులకు చెందిన మరో 9 ప్రదేశాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది.

సోదాల్లో బయటపడిన ఆస్తులు:

తుక్కుగూడ, మహేశ్వరం, రంగారెడ్డి జిల్లాలో 342 చదరపు గజాల స్థలంలో నిర్మించిన 5,200 చ.అ. ట్రిప్లెక్స్ విల్లా

కర్మాన్‌ఘాట్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో 3-BHK అపార్ట్‌మెంట్

నాగోల్‌లో రాక్ టౌన్‌లో 2-BHK ఫ్లాట్

వనపర్తి జిల్లా, షాపూర్ గ్రామంలో 25 ఎకరాల వ్యవసాయ భూమి

నాగర్‌కర్నూల్‌లో 9 ఓపెన్ ప్లాట్లు

వనపర్తి జిల్లా, షాపూర్ గ్రామంలో ఫామ్‌హౌస్

-సుమారు 50 తులాల బంగారు ఆభరణాలు, 2.8 కిలోల వెండి వస్తువులు

-5 వాహనాలు - మహీంద్ర XUV 7XO, మహీంద్ర TUV 300, మారుతి సెలెరియో, హ్యుందాయ్ శాంట్రో, బొలెరో

వీటన్నింటి డాక్యుమెంట్ విలువ మొత్తం రూ. 7,32,66,581/- (రూ. ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల ఎనభై ఒక్కటి). చర, స్థిర ఆస్తుల మార్కెట్ విలువ డాక్యుమెంట్ విలువ కంటే చాలా రెట్లు ఎక్కువ ఉండవచ్చని ఏసీబీ తెలిపింది.

మరిన్ని ఆస్తులపై ధృవీకరణ జరుగుతోంది. కేసు దర్యాప్తులో ఉంది.

ఏసీబీ విజ్ఞప్తి:
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయాలని కోరారు. WhatsApp - 9440446106, Facebook - Telangana ACB, X - @Telangana ACB ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారుల పేరు, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

#DailyBharath #ACB #Nagarkurnool #TelanganaACB #Corruption #DisproportionateAssets

Previous ఒడిశా నుండి మహారాష్ట్రకు 112 కిలోల గంజాయి... బ్రేక్‌డౌన్ అయిన కారుతో దొరికిపోయిన ముఠా...
Next పట్టణ పద్మశాలి సంఘం, సిరిసిల్ల... 29, 33, 38 వార్డుల్లో కొత్త కమిటీలు... అధ్యక్షులుగా వీరే
ADVERTISEMENT