| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అర్ధరాత్రి డీసీఎంలో 33 గోవులు! టాస్క్‌ఫోర్స్ దాడితో దొరికిపోయిన అక్రమ రవాణా ముఠా!

అర్ధరాత్రి డీసీఎంలో 33 గోవులు! టాస్క్‌ఫోర్స్ దాడితో దొరికిపోయిన అక్రమ రవాణా ముఠా!

డైలీ భారత్, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం అరేంపుల వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి నిర్వహించిన వాహన తనిఖీల్లో గోవుల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది.

ఎలాంటి అనుమతులు లేకుండా డీసీఎం వాహనంలో 33 గోవులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు.

33 గోవులతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ తెలిపారు.

పట్టుబడిన నలుగురు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

#DailyBharath #Khammam #KhammamRural #CowSmuggling #TaskForce #TelanganaPolice

Previous మండేపల్లిలో నూతన స్మార్ట్ కార్డుల పంపిణీ... 12 మందికి CMRF చెక్కులు, 60 కుటుంబాలకు చీకటి నుండి విముక్తి!
Next హైదరాబాద్‌కు కొత్త పోలీస్ బాస్! మహేష్ భగవత్ కమిషనర్... సజ్జనార్‌కు కీలక పదవి!
ADVERTISEMENT