ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే! కామారెడ్డిలో పోలీసుల స్పెషల్ డ్రైవ్!
డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు!
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నంబర్ ప్లేట్లు లేకుండా నడుపుతున్న వాహనాలను నిలిపివేసి, వాహనదారులకు జరిమానా విధించడమే కాకుండా అక్కడికక్కడే నంబర్ ప్లేట్లను బిగించారు! అలాగే, పట్టుబడిన వాహనాలపై గతంలో ఉన్న పెండింగ్ చలాన్లను ఆన్ లైన్ లో తనిఖీ చేసి వాహనదారుల చేత కట్టించారు! మరోసారి నంబర్ ప్లేట్లు లేకుండా పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు!
అదేవిధంగా, తల్లిదండ్రులు మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని, మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు!
పట్టణంలో ఈ తనిఖీలు ఇకపై నిరంతరం కొనసాగుతాయని, వాహనదారులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు!
#DailyBharath #Kamareddy #TrafficPolice #TrafficRules #SpecialDrive