| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్లలో బాల్యవివాహాలపై యుద్ధం! పోస్టర్ ఆవిష్కరించిన డీఎస్పీ!

సిరిసిల్లలో బాల్యవివాహాలపై యుద్ధం! పోస్టర్ ఆవిష్కరించిన డీఎస్పీ!

బాల్యవివాహ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల... అవగాహన పోస్టర్ ఆవిష్కరణ!

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:బాల్యవివాహాల నిర్మూలనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. బాల్యవివాహ రహిత భారతదేశం - బాల్యవివాహ రహిత రాజన్న సిరిసిల్ల జిల్లా లక్ష్యంగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.

జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన "బాల్యవివాహ రహిత భారతదేశం" లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మరియు ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన బాల్యవివాహాల నిర్మూలన అవగాహన పోస్టర్ ను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బాల్యవివాహాల వల్ల బాలికల భవిష్యత్తు, విద్య, ఆరోగ్యం, సామాజిక జీవితంపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించారు. బాల్యవివాహాల నివారణకు పోలీస్ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, రాజన్న సిరిసిల్ల జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిపిఓ కవిత, ఆశ్రిత ఎన్జీవో స్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పర్వతాలు, ఫైనాన్స్ మేనేజర్ వెంకటేష్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ స్రవంతి, జిల్లా కోఆర్డినేటర్ లహరి, హరిబాబు, ప్రశాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

#DailyBharath #Sircilla #RajannaSircilla #ChildMarriageFreeBharat #StopChildMarriage

Previous ప్రజాప్రతినిధి పట్టించుకోలేదు... ప్రజలే ప్రతినిధులయ్యారు!
Next చెరువును కాపాడాల్సిన అధికారులే చెరువుకు గండి కొట్టారా!
ADVERTISEMENT