డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (థానా) రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కార్యవర్గ ఏర్పాటు మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది.
థానా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి. ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అసోసియేషన్ మాజీ అధ్యక్షులు డాక్టర్ అరుణ్ కటారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గం:
జిల్లా అధ్యక్షులు: డాక్టర్ అజ్మీరా జైల్ సింగ్ (శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్)
ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ): డాక్టర్ అభినయ్ గోవర్ధన్ (అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట)
అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ చొరవ చూపాలని సూచించారు. వైద్యులందరూ ఐక్యంగా ఉంటూ ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ చింతోజు శంకర్, డాక్టర్ మనోహర్, డాక్టర్ స్వామి, డాక్టర్ పెంచలయ్య, చింతోజు భాస్కర్‌తో పాటు జిల్లాలోని పలువురు థానా సభ్యులు, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.
#DailyBharath #Sircilla #RajannaSircilla #THANA #Doctors