మండేపల్లిలో పండగ వాతావరణం! స్మార్ట్ రేషన్ కార్డులు + CMRF చెక్కులు + కొత్త ట్రాన్స్‌ఫార్మర్!
డైలీ భారత్, తంగళ్లపల్లి: తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ గాధగోని సాగర్‌తో కలిసి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మునిగేల రాజు పంపిణీ చేశారు.
గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మునిగేల రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల లబ్ధిదారులకు రేషన్‌తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సులభంగా అందుతాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులు కొత్త కార్డులు అందుకున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.
"సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ"
అనంతరం గ్రామంలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
- రాగిపల్లి సుస్మిత - రూ.17,500
- తంగళ్ళపల్లి లింగయ్య - రూ.27,500
- దాసరి లక్ష్మి - రూ.14,000
- కొమ్మట అఖిల - రూ.10,000
- నేబురి మల్లవ్వ - రూ.14,000
- సత్తు ఎల్లయ్య - రూ.47,500
- దుబ్బ గంగరాజు - రూ.28,000
- రాగిపల్లి లచ్చయ్య - రూ.24,500
- ఒగ్గు శాంతవ్వ - రూ.11,000
- దూస రాజమల్లు - రూ.5,000
మార్షల్ రాధ - రూ.80,000
ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రజా ప్రభుత్వానికి, మండల నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
"నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం"
గ్రామంలోని ముదిరాజ్ సంఘం నుండి పల్లె వరకు సుమారు 200 మీటర్లు మధ్యలో విద్యుత్ స్తంభాలు, కరెంటు లేకపోవడంతో పల్లెలో ఉన్న సుమారు 60 కుటుంబాల వరకు రాత్రి వేళలో సాయంత్రం దాటితే వెళ్లాలంటే చీకట్లోనే ప్రజలు నిత్యం నరకయాతనతో పాములు, కప్పలు దాటుకుంటూ వెళ్లేవారు.
సాయంత్రం వేళలో విద్యార్థులు పాఠశాల నుండి తిరిగి రావాలంటే, రైతులు పొలాలకు వెళ్లాలంటే మరియు కిరాణా షాపులకు వెళ్లాలంటే చీకట్లోనే వెళ్లాలి లేదా సుమారు ఒక కిలోమీటర్ల దూరం నుండి నడిచి వెళ్లేవారు.
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం సర్పంచ్ గాధగోని సాగర్ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి నేడు సుమారు ఒక లక్ష రూపాయలతో ట్రాన్స్ఫార్మర్, ఎనిమిది స్తంభాలు ఏర్పాటు చేసి బల్బులు పెట్టడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాధగోని సాగర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మునిగేలా రాజు, ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, జలగం ప్రవీణ్ (టోనీ), బండి పరశురాములు, పొన్నాల పరశురాములు, చేన్నమనేని ప్రశాంత్, కాంగ్రెస్ మండల మహిళా అధ్యక్షురాలు ధర్మారెడ్డి హారిక, కాంగ్రెస్ నాయకులు నక్క నరేష్, ధర్మారెడ్డి చందు, యాస రాజేశ్, గుంటి శ్రీను, గ్రామ ఉప సర్పంచ్ యాస సందీప్, వార్డ్ సభ్యులు అమరగొండ ప్రభుదాస్, కడారి ప్రతాపరెడ్డి, పెద్ది రేవతి, పెద్ది మల్లవ్వ, సింగం శశి కుమార్, బోడపట్ల రాకేష్, తిమ్మనగరం దేవదాస్, కొమ్మెట మల్లేశం, జడల రమ్య, యాస శ్రీవాణి, బండి రేణుక, గ్రామ కార్యదర్శి ముదం ప్రశాంత్, కారోబార్ లచ్చి రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ కొమ్మెట దేవయ్య, జిపిఓ భరత్, రేషన్ డీలర్ బాబాయి, సెస్ ఏఈ, లైన్ మెన్ గనూప రాము తదితరులు పాల్గొన్నారు.
#DailyBharath #Mandepally #Thangallapally #Sircilla #SmartRationCard #CMRF