| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భార్యాభర్తల గొడవలకు కారణం ఇదే... ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తోనే పరిష్కారం అంటున్న సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

భార్యాభర్తల గొడవలకు కారణం ఇదే... ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తోనే పరిష్కారం అంటున్న సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజీవ్ నగర్‌లో మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో ఈరోజు పవర్‌లూమ్ కార్మికులకు మనోవికాస సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ పాల్గొని కుటుంబ సంబంధాలు, కుటుంబ వివాదాల పరిష్కారం, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, ఆర్థిక సమస్యలు, పిల్లల పెంపకం, పరస్పర అనుమానాలు, మద్యపానం, పని ఒత్తిడి వంటి అంశాలు కుటుంబ వివాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల అవి పెద్ద వివాదాలుగా మారి కుటుంబ ప్రశాంతతను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.

కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, సహనం, గౌరవం, ఓపికతో కూడిన సంభాషణ ఎంతో ముఖ్యమని వివరించారు.

సమస్యలు తలెత్తినప్పుడు ఒకరినొకరు నిందించుకోకుండా, ఈగో (అహం)కు పోకుండా పరస్పరం మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సూచించారు.

కుటుంబ సమస్యలు తీవ్రమైనప్పుడు ఫ్యామిలీ కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా భార్యాభర్తల మధ్య అపోహలను తొలగించి, భావోద్వేగ సమస్యలను అర్థం చేసుకొని, సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. కౌన్సెలింగ్ అనేది కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

అలాగే కార్మికులు వృత్తిపరమైన ఒత్తిడిని కుటుంబ జీవితంపై ప్రభావం చూపకుండా చూసుకోవాలని, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవసరమైన వారు మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ మరియు కార్మికులు పాల్గొన్నారు.

#DailyBharath #RajannaSircilla #RajivNagar #FamilyCounseling #MindCare #MentalHealth

Previous 21 రోజులు... 600 కిలోమీటర్లు.. అయ్యప్ప దీక్షతో తమిళనాడు సరిహద్దుకు చేరిన సంజయ్ గురుస్వామి బృందం!
Next ఒడిశా నుండి మహారాష్ట్రకు 112 కిలోల గంజాయి... బ్రేక్‌డౌన్ అయిన కారుతో దొరికిపోయిన ముఠా...
ADVERTISEMENT