| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

21 రోజులు... 600 కిలోమీటర్లు.. అయ్యప్ప దీక్షతో తమిళనాడు సరిహద్దుకు చేరిన సంజయ్ గురుస్వామి బృందం!

21 రోజులు... 600 కిలోమీటర్లు.. అయ్యప్ప దీక్షతో తమిళనాడు సరిహద్దుకు చేరిన సంజయ్ గురుస్వామి బృందం!

డైలీ భారత్, హోసూర్:అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం (ABABS) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కుచూరి సంజయ్ గురుస్వామి చేపట్టిన శబరిమల మహా పాదయాత్ర 21వ రోజు తమిళనాడు సరిహద్దుకు చేరుకుంది.

గత నెల 23న సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర బుద్గీర్ నుండి తమిళనాడు సరిహద్దు మీదుగా ఈరోజు సాయంత్రానికి హోసూర్‌కు చేరుకుంది.

ఈరోజు రాత్రికి హోసూర్‌లో బస చేసి, రేపు ఉదయం హోసూర్ నుండి మళ్లీ పాదయాత్ర ప్రారంభమవుతుందని, రేపు సాయంత్రానికి రాయకోట్టైకు చేరుకుంటామని సంజయ్ గురుస్వామి తెలిపారు.

#DailyBharath #Sabarimala #Padayatra #AyyappaSwamy #ABABS #SanjayGuruswamy #Hosur

Previous బచ్చల కొయ్యగూడెంలో విషాదం... ముక్తి లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు!
Next భార్యాభర్తల గొడవలకు కారణం ఇదే... ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తోనే పరిష్కారం అంటున్న సైకాలజిస్ట్ కె. పున్నంచందర్
ADVERTISEMENT