డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గం, జూలూరుపాడు మండలం, పాపకొల్లు గ్రామపంచాయతీ పరిధిలోని బచ్చల కొయ్యగూడెం గ్రామానికి చెందిన ముక్తి లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, పార్టీ తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుమ్మడి వెంకటేశ్వర్లు, మాలోత్ నరసింహారావు (స్వామి), బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు రామిశెట్టి వంశీ, రావుట్ల నరేష్ చారి, వాంకుడోత్ బాబులాల్, గ్రామ నాయకులు జబ్బా రామనాధం, వట్టం ప్రసాద్, జబ్బా నాగరాజు, జబ్బా నారాయణ, పురేటి నాగేశ్వరరావు (ఎలక్ట్రికల్) తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#DailyBharath #Wyra #Julurupadu #Papikollu #BRS #Khammam