| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న బీజేపీ నాయకులు తంబళ్ల రవి

సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న బీజేపీ నాయకులు తంబళ్ల రవి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ ​బహుజన వీరుడు,మొఘల్ పాలకులపై పోరాడిన విప్లవకారుడు సర్దార్  ​సర్వాయి పాపన్న గౌడ్,ధైర్యసాహసాలు, అణగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని,సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి,గోల్కొండ కోటను ఏలిన వీరునిగా పాపన్న గౌడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని,ఆయన స్మారకార్థం విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు,బిజెపి నాయకులు కృష్ణ,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కోలికపోగు కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Previous సిరిసిల్లను "టూరిస్ట్ స్పాట్" లా చూస్తున్న KTR... అంబేద్కర్ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీజేపీ లేఖ
Next మొఘల్ దౌర్జన్యాలపై పోరాడిన సర్వాయి పాపన్న స్ఫూర్తి సదా చిరస్మరణీయం... సాయి గౌడ్
ADVERTISEMENT