| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మొఘల్ దౌర్జన్యాలపై పోరాడిన సర్వాయి పాపన్న స్ఫూర్తి సదా చిరస్మరణీయం... సాయి గౌడ్

మొఘల్ దౌర్జన్యాలపై పోరాడిన సర్వాయి పాపన్న స్ఫూర్తి సదా చిరస్మరణీయం... సాయి గౌడ్

డైలీ భారత్, కామారెడ్డి:బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను సదాశివనగర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చుక్క సాయి గౌడ్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్య గీత కార్మిక కుటుంబంలో జన్మించిన సర్వాయి పాపన్న పాలకుల అణచివేతను ఎదిరించి గెరిల్లా సైన్యాన్ని నిర్మించి సుమారు 21 కోట్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 

దక్షిణ భారతదేశంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి స్వాతంత్ర్య సమరయోధులకు సర్వాయి పాపన్న చరిత్ర గొప్ప స్ఫూర్తినిచ్చిందని, బ్రిటిష్ పాలకులపై పోరాడేందుకు ఆయన జీవితం ఆదర్శమని కొనియాడారు.

అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#DailyBharat #KamareddyNews #Sadashivnagar #SarvaiPapannaJayanthi

Previous సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Next బైక్ దొంగల ముఠా అరెస్ట్ – ఇద్దరు నిందితులు రిమాండ్‌కు తరలింపు
ADVERTISEMENT