ఇల్లు సంపూర్ణంగా పూర్తి అయిన తర్వాతే ప్రారంభించాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం
గత ప్రభుత్వంలో అసంపూర్ణంగా డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ ఇళ్లు ఇచ్చినట్లు...ప్రస్తుతం ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు లు అలా కాకుండా చూడాలి
బిల్లులు పడక ఇబ్బంది పడుతున్న ఇందిరమ్మ ఇల్ల లబ్ధిదారులు
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఇందిరమ్మ ఇల్లను పరిశీలించిన నియోజకవర్గ బిజెపి నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ మంత్రులు..ఎమ్మెల్యేలు అత్యుత్సాహంతో అసంపూర్ణంగా ఉన్న ఇళ్లను ప్రారంభిస్తున్నారు అని అలా ప్రారంభించడం వల్ల గత ప్రభుత్వంలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లాగే ఇవి కూడా లబ్ధిదారులకు నిరాశ కలిగించే అవకాశం ఉన్నది...?ఇప్పటికే ఇంద్రమ్మ లబ్ధిదారులు బిల్లులు పడక అప్పులు చేసి తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టుకోలేక నానా ఇబ్బంది పడుతున్నారు,ఇప్పటికైనా అధికారులు స్పందించి లబ్ధిదారులకు వెంటనే బిల్లులు విడుదల చేయాలని,ఇందిరమ్మ ఇల్లు సంపూర్ణంగా పూర్తయిన తర్వాతే ఇళ్లను ప్రారంభించాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం,ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,పూచి ప్రసాదు,కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.