| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

డైలీ భారత్, అంతర్గాం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై  అనుమానంతో భర్త గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. మురుమూరు గ్రామానికి చెందిన నంది రాయమల్లు, ఆయన భార్య  లక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శనివారం తెల్లవారు జామున కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య లక్ష్మిపై అనుమానం పెంచుకున్న రాయమల్లు గొడ్డలితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వై. కృష్ణ కుమార్, అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను విచారించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అంతర్గాం ఎస్ఐ బోయ వెంకటస్వామి తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు  త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Previous ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Next ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
ADVERTISEMENT