ఆరు ఫైర్ ఫైటింగ్ టీమ్స్ రంగంలోకి దిగి మంటలు అదుపు..
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: సాల్మి ప్రాంతంలోని అల్-నాయమ్ స్క్రాప్‌యార్డ్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా రంగంలోకి దిగిన ఆరు అగ్నిమాపక బృందాలు తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాయి.
సమయానికి స్పందించి మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకోవడంతో తృటిలో పెద్ద ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు.
#Kuwait #FireAccident #Salmi