| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

డైలీ భారత్, పల్నాడు: పల్నాడు జిల్లా మాచవరం మండలం మరియు బెల్లంకొండ మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాల్లో ఉన్న విద్యుత్తు తీగలను మరియు ట్రాన్స్ఫార్మర్లలో ఉన్న రాగి వైర్లను అపహరించిన నలుగురు నిందితులను వీరి వద్ద కొన్న వ్యాపారిని కూడా అరెస్టు చేసినట్లు మాచవరం పోలీసులు తెలిపారు. గత 20 రోజులుగా ఈ రెండు మండలాల్లో పలు గ్రామాల్లో పంట పొలాల్లో ఉన్న ఈ వైర్లను అపహరించి గుంటూరు కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తికి విక్రయించడం జరిగిందని తెలిపారు. 

సమాచారం మేరకు నిందితులైన శ్రీ రుక్మిణి పురం గ్రామానికి చెందిన  కటికం శేషగిరి వడితే రంగనాయక్ కొత్త గణేషన్ పాడు గ్రామానికి చెందిన లంజపల్లి రాజేష్, ఇద్దరు మైనర్లు మొత్తం ఐదుగురిని మాచవరం మండలం పిల్లుట్ల ప్రాంతంలో శుక్రవారం  అరెస్టు చేసి వారి వద్ద ఉన్న వైర్లను స్వాధీనపరుచుకొని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినారు.

గత రెండు నెలల్లో ట్రాన్స్ఫార్మర్ దొంగలను పట్టుకోవటం ఇది రెండోసారి...

Previous నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Next రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు
ADVERTISEMENT