| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

డైలీ భారత్, కామారెడ్డి : హ్యూమన్‌ రైట్స్‌ యాంటీ కార్పొరేషన్ అసోసియేషన్‌కామారెడ్డి జిల్లా చైర్మన్‌గా  పాల్వంచ మండలం ఫరీద్ పేట్ కు చెందిన దేవోల్లా రాములు ఎన్నికయ్యారు. ఇట్టి కార్యవర్గ సమావేశం సికింద్రాబాద్ అమృతవాణి నిలయంలో ఏర్పాటు చేశారు.ఈ మేరకు  దేవోల్లా రాములు కు నియమాకపత్రాన్ని హ్యూమన్ రైట్స్  నేషనల్ ఫౌండర్ డైరెక్టర్ సాల్మన్ రాజ్, డైరెక్టర్ రవికుమార్ లీగల్ వింగ్  చైర్మన్ ఊర్మిళ రాణి పాట్రో మరియు స్టేట్ చైర్మన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండ ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ మంజుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగాదేవోల్లా రాములు  మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానన్నారు.మానవ హక్కులు (హ్యూమన్ రైట్స్) అంటే మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరికీ, ఎలాంటి వివక్ష లేకుండా (కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా) సంక్రమించే ప్రాథమిక హక్కులు మరియు స్వేచ్ఛ. ఇవి ప్రతి మనిషి గౌరవంగా జీవించడానికి అవసరమైన న్యాయం మరియు సమానత్వాన్ని అందిస్తాయని తెలిపారు.

Previous అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Next కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
ADVERTISEMENT