| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

నత్త నడక నడుస్తున్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు

సరయిన వైద్య సదుపాయం లేక గాల్లో కలుస్తున్న ప్రమాద బాధితుల ప్రాణాలు

డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో నిర్మిస్తున్న 100పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం అశ్వారావుపేటలో నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు నత్త నడక నడుస్తున్నది,గత ప్రభుత్వాలు...ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అశ్వారావుపేటలో వైద్య సేవలు మెరుగు పర్చలేకపోయారు,సరైన వైద్యం అందక దుర ప్రాంత వెళ్ళే సరికి పేసెంట్ల ప్రాణాలు గాల్లో కలుస్తున్నవి,ఏజెన్సీ ప్రాంతం మారు మూల గ్రామాల నుంచి ప్రజలు వైద్యం కోసం ఇక్కడకు వస్తె స్కానింగ్,X-ray ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది,స్థానిక ఎమ్మెల్యే స్పందించి 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని బిజెపి పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం,ఇ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,పూచి ప్రసాద్, కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.

Previous ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను
Next హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు
ADVERTISEMENT