| Daily భారత్
Logo




సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రజలే భాగస్వాములు కావాలి : ఎస్పీ మహేష్ బి. గితే

News

Posted on 2026-06-04 08:44:22

Share: Share


సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రజలే భాగస్వాములు కావాలి : ఎస్పీ మహేష్ బి. గితే

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షితమైన, శాంతియుతమైన సమాజ నిర్మాణం సాధ్యమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యాచరణలో భాగంగా తంగళ్ళపల్లి మండలం తడూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. స్వీయ రక్షణ, కుటుంబ క్షేమం కోసం వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లకు దూరంగా ఉండాలని, మైనర్ డ్రైవింగ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. "అరైవ్ అలైవ్" కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు మరింత చురుకుగా పనిచేయాలని, గ్రామంలోని రహదారి సమస్యలు, బ్లాక్ స్పాట్లను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

మహిళలు, యువతులు, బాలికల రక్షణ కోసం జిల్లాలో షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని ఎస్పీ తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు లేదా పని ప్రదేశాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా షీ టీమ్ నంబర్ 87126 56425కు సమాచారం అందించాలని సూచించారు. బాధితులకు భరోసా కేంద్రం ద్వారా న్యాయపరమైన, వైద్య, మానసిక కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, వీటి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ ఉపేందర్ చారి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Image 1

ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది ...

Posted On 2026-07-25 04:00:34

Readmore >
Image 1

రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు

Posted On 2026-07-24 19:19:00

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్

Posted On 2026-07-24 19:17:19

Readmore >
Image 1

స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని దుర్మరణం

Posted On 2026-07-24 17:51:05

Readmore >
Image 1

జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Posted On 2026-07-24 17:38:47

Readmore >
Image 1

దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-07-24 16:54:48

Readmore >
Image 1

బిబిపేట మండలంలోని బిబిపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ సందర్శన

Posted On 2026-07-24 13:56:04

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు

Posted On 2026-07-24 13:53:56

Readmore >
Image 1

పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం

Posted On 2026-07-24 09:13:16

Readmore >
Image 1

కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం

Posted On 2026-07-24 09:09:28

Readmore >