| Daily భారత్
Logo




MGM ఆస్పత్రి అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి..

News

Posted on 2026-06-03 22:16:36

Share: Share


MGM ఆస్పత్రి అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి..

నిరుపేదలకు ఆపద్బాంధవుడిగా ఎంజీఎం సేవలు కొనసాగాలి..

PMSSY నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తా..

న్యూరో సర్జరీ విభాగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలి..

ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి..

వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు నాణ్యమైన సేవలు అందించాలి..

HDS సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలి..

న్యూరో సర్జరీ విభాగాన్ని బలోపేతం చేయాలి..

ప్రజల ఆరోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం..

డా.కడియం కావ్య, ఎంపీ,వరంగల్ 

డైలీ భారత్, వరంగల్: వరంగల్ MGM ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో రాష్ట్ర పర్యాటక దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ,  ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, కలెక్టర్లు సత్య శారద, చాహత్ బాజ్‌పాయ్ కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ప్రధానంగా ఆసుపత్రి అభివృద్ధి పనులు, వైద్య సేవల నాణ్యత, రోగులకు సౌకర్యాలు, మౌలిక వసతుల మెరుగుదలతో పాటు నూతన నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై సమగ్ర సమీక్ష నిర్వహించారు..

ఈ సమీక్ష సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ...

ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్య సంస్థగా పేరొందిన ఎంజీఎం ఆస్పత్రి నిరుపేదలకు ఆపద్బాంధవుడిగా నిలుస్తోందని, ఈ ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు ఆరోగ్య భరోసాగా నిలుస్తున్న ఈ ఆస్పత్రి సేవలను మరింత విస్తరించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఆస్పత్రి అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం హెచ్‌డీఎస్ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఆస్పత్రికి సంబంధించిన సమస్యలు, అవసరాలను తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పీఎంఎస్‌ఎస్‌వై (PMSSY) పథకం కింద మరిన్ని నిధులు తీసుకురావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఆస్పత్రిలో న్యూరో సర్జరీల సంఖ్య ఎందుకు తగ్గిందని అధికారులను ప్రశ్నించిన ఎంపీ, న్యూరో సర్జరీ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, వారికి అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. వారి ఆరోగ్య సమస్యల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు తెలిపారు.

వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, రోగుల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు సేవ చేయడం వైద్యుల ప్రధాన కర్తవ్యమని, ముఖ్యంగా నిరుపేదలు ఎక్కువగా వచ్చే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ఆస్పత్రికి సంబంధించిన ఏ సమస్య అయినా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ఎంపీ డాక్టర్ కడియం కావ్య హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఎంజీఎం ఆస్పత్రిని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన వైద్య సంస్థగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో  ఎంజీఎం సూపర్డెంట్ డాక్టర్ హరిచంద్ర రెడ్డి, డాక్టర్ అశ్విన్ కుమార్, జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిబిసిడివో పుష్పలత, డిటిడిఓ నారాయణరెడ్డి, డి ఆర్ డి ఓ నాగపద్మజ, అభివృద్ధి కమిటీ మెంబర్స్ డాక్టర్ బి శ్రీనివాస్ గౌడ్ డాక్టర్ టి రఘునాథ్ స్వామి డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి డాక్టర్ సిహెచ్ మురళి డాక్టర్ అనిల్ , కె ఎస్ కె  ప్రసాద్, డాక్టర్ లోకేష్ కుమార్ డాక్టర్ మన్మోహన్ రాజ్ , ఇవి శ్రీనివాస్ ఐ ఆర్ సి ఎస్ నెంబర్, శ్రీ వనపర్తి శ్రీనివాస్,  కన్నుజు  లావణ్య రమేష్ , డాక్టర్ సాంబశివరావు డాక్టర్ సంధ్యా  డాక్టర్ శరత్ బాబు మరియు సంబంధిత అధికారులు ఎంజీఎం డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు..

#PostByAdmin, #cmrevanthreddy #kadiyamkavya, #warangal #MemberOfParliament #MGM #hospital

Image 1

MGM ఆస్పత్రి అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి..

Posted On 2026-06-03 22:16:36

Readmore >
Image 1

ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా.. ఆహ్లాదం పెంచేలా వేములవాడ బండ్ పార్క్

Posted On 2026-06-03 22:09:33

Readmore >
Image 1

కరీంనగర్ : నంబర్ ప్లేట్ లేని 120 వాహనాల సీజ్

Posted On 2026-06-03 21:58:52

Readmore >
Image 1

వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా టూరిజం హబ్ గా మార్చడమే లక్ష్యం : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-06-03 21:25:37

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : యువతి అదృశ్యం

Posted On 2026-06-03 21:24:22

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులు, బెదిరించి తీసుకెళ్లిన వైనం

Posted On 2026-06-03 21:22:43

Readmore >
Image 1

మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-03 21:11:18

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం

Posted On 2026-06-03 20:05:43

Readmore >
Image 1

వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదురుకునేందుకు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలి

Posted On 2026-06-03 20:01:51

Readmore >
Image 1

జనసేన పార్టీలో తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు

Posted On 2026-06-03 20:00:43

Readmore >