| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కోనరావుపేట మండలంలో ప్లాస్టిక్ రహిత ధర్మారం లక్ష్యంగా ముందడుగు

కోనరావుపేట మండలంలో ప్లాస్టిక్ రహిత ధర్మారం లక్ష్యంగా ముందడుగు

దుకాణాలపై  గ్రామ కార్యదర్శి, పంచాయతీ పాలకవర్గం ఆకస్మిక తనిఖీలు, నోటీసుల జారీ

డైలీ భారత్, కోనరావుపేట: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, ప్రభుత్వం చేపట్టిన ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయడంలో కోనరావుపేట మండలం ధర్మారం గ్రామ పంచాయతీ కఠినంగా వ్యవహరిస్తోంది. గ్రామంలోని కిరాణా దుకాణాలు, వ్యాపార సంస్థలలో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి బండారి మనిష ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ వాడుతున్న దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు. ఈ తనిఖీల్లో వార్డు సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొని వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఏకపక్షంగా ప్లాస్టిక్ కవర్లు, నాణ్యత లేని ప్లాస్టిక్ సంచులను వాడటం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, వాటిని వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌కు బదులుగా పేపర్ బ్యాగులు, జనపనార సంచులను వాడాలని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానాలు ఉంటాయని స్పష్టం చేశారు.

Previous కామారెడ్డి జిల్లా తెలంగాణ పిఆర్టియు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన మహోత్సవం
Next సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన కోర్టు కానిస్టేబుల్ భాస్కర్
ADVERTISEMENT