| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన కోర్టు కానిస్టేబుల్ భాస్కర్

సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన కోర్టు కానిస్టేబుల్ భాస్కర్

జిల్లా కోర్టు ఆవరణలో గుండె నొప్పితో కుప్పకూలిని వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కొనరావుపేట కోర్టు కానిస్టేబుల్ భాస్కర్

కోర్టు కానిస్టేబుల్ భాస్కర్ ని అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు జిల్లా కోర్టు ఆవరణలో ఇల్లంతాకుంట మండలం కట్కూరు గ్రామానికి చెందిన వెంకటేశం కోర్టు కి హాజరు కాగా అకస్మాత్తుగా గుండె నొప్పితో కుప్పకులగా అక్కడే ఉన్న కొనరావుపేట పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ భాస్కర్ సకాలంలో స్పందించి సీపీఆర్ చేయడంతో బాధితుడు స్పృహలోకి రావడంతో పాటు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

కానిస్టేబుల్స్ చాకచక్యంగా వ్యవహరించడంతో వెంకటేశం  ప్రాణాలతో బయటపడ్డారు. సీపీఆర్ చేసి వ్యక్తి  ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ లను నెటిజన్లు అభినందిస్తున్నారు.

హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా పోలీసులకు ఉన్నతాధికారులు ఇప్పించిన సీపీఆర్ శిక్షణ ఓ నిండు ప్రాణం నిలబెట్టింది.

Previous కోనరావుపేట మండలంలో ప్లాస్టిక్ రహిత ధర్మారం లక్ష్యంగా ముందడుగు
Next నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టు
ADVERTISEMENT