| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బూర్గంపాడు మండలం : లక్ష్మీపురం లారీ యార్డు వద్ద వ్యక్తి దారుణ హత్య

బూర్గంపాడు మండలం : లక్ష్మీపురం లారీ యార్డు వద్ద వ్యక్తి దారుణ హత్య

బూర్గంపాడు ఎస్సై మేడ ప్రసాద్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లారీ యార్డు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో, ఓ వ్యక్తిపై బండరాయితో తలపై బలంగా దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

మృతుడిని బీహార్ రాష్ట్రానికి చెందిన కుందన్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హత్యకు దారితీసిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Previous ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీపై కేంద్రం నూతన మార్గదర్శకాలు
Next బీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్కపురి నరసింహారావు ను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
ADVERTISEMENT