| Daily భారత్
Logo




పెళ్లయిన నెల రోజులకే దంపతుల ఆత్మహత్య

News

Posted on 2026-05-11 12:26:31

Share: Share


పెళ్లయిన నెల రోజులకే దంపతుల ఆత్మహత్య

ఏడాదిగా ప్రేమ... తర్వాత పెళ్లి... మనస్పర్ధలు

డైలీ భారత్, సిద్దిపేట: ప్రేమ పెళ్లి చేసుకొని ఇద్దరు మనస్పర్థలు రావడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......కొమురవెళ్లి గ్రామానికి చెందిన దేశెట్టి వినయ్(23) అనే యువకుడు గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొండపాక గ్రామానికి చెందిన దండ్ల అంజలి(21) అనే యువతి దర్జా పని చేస్తూ తల్లిదండ్రులకు చేదోవాదోడుగా ఉంటుంది. గత సంవత్సరం అంజలి, వినయ్ గాఢంగా ప్రేమించుకున్నారు. ఇరువైపుల కుటుంబ సభ్యులను ఒప్పించి నెల రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వినయ్ పలుమార్లు ఫోన్ చేసినప్పుడు అంజలి ఎంగేజ్ రావడంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఫోన్ ఆలస్యంగా మాట్లాడడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. వినయ్ ఫోన్ చేయడంతో ఆలస్యంగా లిఫ్ట్ చేయడంతో ఆమెపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో మనస్థాపం చెందిన అంజలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. ఈ విషయం ప్రియుడికి తెలియడంతో రాయవరం గ్రామ శివారులో చెట్టుకొని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తన తండ్రి సహదేవ్‌కు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పడంతో పాటు లోకేషన్ షేర్ చేశాడు. తల్లిదండ్రులు, స్నేహితులు అక్కడికి వెళ్లే చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >
Image 1

జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్‌ హుస్సేన్‌కు కలెక్టర్‌ అంకిత్‌ ఘన స్వాగతం

Posted On 2026-08-24 14:09:34

Readmore >
Image 1

భర్తను చంపి, అవయవాలు కోసి సంచిలో పెట్టిన భార్య...

Posted On 2026-08-24 06:18:12

Readmore >
Image 1

అంగన్వాడీ భవనం ను వెంటనే నిర్మాణం చేపట్టాలి సిపిఎం

Posted On 2026-08-24 04:57:31

Readmore >