Posted on 2026-04-14 11:13:54
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: భారత రాజ్యాంగ నిర్మాత,మహా మేధావి,సామాజిక న్యాయ సాధకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన టీడీపీ వేములవాడ అడాహాక్ కమిటీ సభ్యులు,టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు మోతె రాజిరెడ్డి.ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమానత్వం,న్యాయం,స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని,ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు,రక్షణ,గౌరవాన్ని కల్పించే శాశ్వత దారిదీపంగా నిలిచిందని, “విద్య పొందండి –సంఘటితమవండి –పోరాడండి” అనే ఆయన సందేశం నేటి యువతకు మార్గదర్శకం అని తెలిపారు.
సమాజంలో సమానత్వం,సోదరభావం,న్యాయం నెలకొల్పడమే అంబేద్కర్ గారి లక్ష్యం అని,ఆ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని మోతె రాజిరెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మిద్దె ప్రకాష్ పాల్గొన్నారు.
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్
Posted On 2026-07-29 08:54:06
Readmore >
చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ
Posted On 2026-07-29 08:52:51
Readmore >