| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

డైలీ భారత్, కామారెడ్డి: కలెక్టరేట్ సమీపం లో గల ఈవీఎం గోదాం ను గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు.

ప్రతీ నెల నిర్వహించే నియమిత తనిఖీలలో భాగంగా ఈవీఎం (EVM) గోదాంను సందర్శించి పరిశీలించారు. గోదాంలో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, డబుల్ లాక్ సిస్టమ్, ఫైర్ సేఫ్టీ పరికరాలు తదితర అంశాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా గోదాంలో భద్రపరచిన ఈవీఎంల స్థితి, నిర్వహణ విధానం, రికార్డుల నిర్వహణపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎలాంటి లోపాలు లేకుండా పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు సూచించారు.

అనంతరం వాటర్  ట్యాంక్ ను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ విక్టర్, rdo NV గిరి, తహసీల్దార్ హిమబిందు, రెవెన్యూ, సిబ్బంది పాల్గొన్నారు.

Previous యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Next గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం
ADVERTISEMENT