Posted on 2026-03-28 06:57:35
అరెస్టులు , నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు.
ఆశ వర్కర్ల పట్ల ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలి.
సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈరోజు మార్చి 28న ఆశా వర్కర్ల చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ మహాధర్న ను భగ్నం చేయాలని జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆశా వర్కర్లను అక్రమంగా ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్భందించడాన్ని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా సిరిసిల్లలోని సుందరయ్య నగర్ , అంబేద్కర్ నగర్ PHC ల ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేసి అక్రమంగా పోలీస్ స్టేషన్ లో నిర్భందించిన వారిని కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల జరుగుతున్న ఈ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలో కి వస్తే ఆశా వర్కర్ల కి నెలకి 18 వేల రూపాయల ఫిక్స్డ్ వేతనాన్ని ఇస్తామని,పని భద్రత కల్పిస్తామని అనేక హామీలు ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 27 నెలలు అవుతున్న ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆశాలకు రావలసిన పారితోషకాలు కూడా సకాలంలో ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని మండిపడ్డారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన , ధర్నా తెలియజేసే హక్కు కల్పిస్తున్నామని చెబుతూనే మరోవైపు శాంతియుతంగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాకు వెళుతున్న ఆశా వర్కర్లను పోలీసుల చేత నిర్బంధించడం అన్యాయం అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వానికి ఆశ వర్కర్ల పైన చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీల కోసం బడ్జెట్ కేటాయించాలని లేకుంటే రానున్న రోజుల్లో పోరాటాలు , ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
అరెస్ట్ అయిన వారిలో లావణ్య , చంద్రకళ , రజిత , నిర్మల , మమత , లక్ష్మి , గీత , స్వప్న , జ్యోతి , బాలలక్ష్మి , అనిత తదితరులు ఉన్నారు.
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >