Posted on 2026-03-25 15:05:43
వారంలో రెండు రోజులు సేవలు అందుబాటులో
ఎల్లారెడ్డిపేటలో భవిత కేంద్రం ప్రారంభం
డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట: దివ్యాంగ విద్యార్థులు భవిత కేంద్రం సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో భవిత కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. భవిత కేంద్రం పరిధిలో మొత్తం ఎందరు దివ్యాంగులు ఉన్నారు? ఏ ఏ సేవలు వారికి అందిస్తారో ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో భవిత కేంద్రం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. దీని సేవలను దివ్యాంగ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి బుధవారం, గురువారం ఐఈఆర్పీ, ఫిజియోథెరపిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అనంతరం మండల సమాఖ్య భవనాన్ని పరిశీలించి, ఎందరు సభ్యులు ఉన్నారని, స్వయం ఉపాధి, సంఘాల ఆర్థిక కార్యకలాపాలపైన ఆరా తీశారు. అక్కడి నుంచి జూనియర్ కళాశాల మైదానంలో పనులను పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య, ఎంఈవో కృష్ణహరి, తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >