Posted on 2026-03-25 03:40:04
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి.మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రా రెడ్డి, శ్రీనివాస్ లతో కలిసి ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 10 థీముల తో చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, మున్సిపాలిటీల, గ్రామ పంచాయతీల వారీగా పారిశుధ్యం పనులు, విద్యుత్ కు సంబంధించిన మరమ్మత్తులు, భవనాల మరమ్మత్తులు, పెయింటింగ్ వంటి పనులు పూర్తి చేయాలని, కార్యాలయాల పరిశుభ్రత, ఫైళ్ళ క్లియరెన్స్ పూర్తి చేయాలని, ఏ ఒక్క శాఖలో కూడా ఒక్క ఫైల్ కూడా పెండింగ్లో ఉండకుండా పరిష్కరించాలని సూచించారు. మంజూరైన పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు వాటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఫైల్ లు క్లియర్ చేయాలని అన్నారు. 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్లక్ష్య వైఖరితో కాకుండా బాధ్యతతో ప్రతి ఒక్కరూ తమకు నిర్దేశించిన పనులను పూర్తి చేయాలని, నిర్లక్ష్యంగా పని చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లాలో సమార్దవంతగా నిర్వహించి విజయవంతగా పూర్తి చేసేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని తెలిపారు. ప్రతి శాఖ ఈ-ఆఫీస్ నిర్వహణ చేపట్టాలని సూచించారు.
ప్రస్తుతం వేసవి కాలం అయినందున జిల్లాలో ఏ ఒక్క చోట కూడా త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని, అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని, పైపు లీకేజులు లేకుండా చూడాలని, ఎక్కడ నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, అవసరమైన చోట బోరు మోటార్లు, హ్యాండ్ పంపులు, ఇతర తాగునీటి వనరులకు మరమ్మతు పనులు జరిపించాలని అన్నారు. జిల్లా స్థాయి అధికారులు మారుమూల ప్రాంతాలను సైతం సందర్శిస్తూ నీటి సరఫరా తీరుతెన్నుల గురించి వారి ద్వారా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. ప్రస్తుత వేసవి సీజన్ దృష్ట్యా మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులు, ఎంపిడిఓలు సమన్వయంతో, సమిష్టిగా పని చేయాలని అన్నారు. నీటి కొరత ఏర్పడకుండా చేపడుతున్న చర్యలు ప్రజలకు తెలిసేలా చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు
ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.చంద్రా రెడ్డి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కె.శ్రీనివాస్, డీఆర్ఓ సంగీతం, జడ్పీ సి ఈ ఓ కృష్ణారెడ్డి, డిపిఓ సురేశ్ మోహన్, సిపిఓ సౌమ్య, పిడి డీఆర్డీఏ శ్రీలత, వ్యవసాయ శాఖ అధికారి ఉషా, పౌరసరఫరాల శాఖ అధికారి వనజాత, పౌరసరఫరాల శాఖ మేనేజర్ హరీష్, మిషన్ భగీరథ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు రామరావు, నవీన్ కుమార్ రెడ్డి, కేషురామ్, కె.రామవేశ్వరి దేవి, పద్మావతి, ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఎంపిఒలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >