Posted on 2026-03-23 18:03:37
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాసుజాతనగర్ మండల కేంద్రంలో డివైఎఫ్ఐ మరియు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల వర్ధంతిని పురస్కరించుకుని ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్‌ఐ రమాదేవి మాట్లాడుతూ, యువత డ్రగ్స్ మరియు మద్యానికి బానిసలు కాకుండా ఉండాలని సూచించారు. అలవాట్లు వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబం మరియు సమాజానికి కూడా నష్టం కలిగిస్తాయని ఆమె హెచ్చరించారు.
యువత మంచి మార్గంలో నడుచుకుంటూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని, దేశభక్తుల త్యాగాలను స్మరించుకోవడం అంటే వారి ఆలోచనలను ఆచరణలో పెట్టడమేనని ఆమె తెలిపారు. సీపీఎం పార్టీ మండల కార్యదర్శి వీర్ల రమేష్ మరియు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కాళంగి హరికృష్ణ కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు మరియు కార్యకర్తలకు సమాజంలో డ్రగ్స్ మరియు మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.మద్యం మరియు డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుజాతనగర్ ఏఎస్ఐ శివాజీ గణేష్ తదితరులు పాల్గొన్నారు
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >