| Daily భారత్
Logo




భక్తి శ్రద్దలతో పెద్దమ్మ తల్లి కొలుపు

News

Posted on 2026-03-23 03:56:49

Share: Share


భక్తి శ్రద్దలతో పెద్దమ్మ తల్లి కొలుపు

ఊరేగింపులో భారీగా పాల్గొన్న గ్రామస్తులు

అగ్ని పునీతం చేసి తమ భక్తి ని విశ్వాసాన్ని చాటిన ఆదివాసీలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడుఆదివాసి నాయక పోడుల కుల దేవత పెద్దమ్మతల్లి కొలుపు కార్యక్రమాన్ని మండల పరిధి పడమట నర్సాపురం గ్రామంలో అత్యంత భక్తి శ్రద్దలతోటి నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు సాగిన పెద్దమ్మ తల్లి కొలుపు కార్యక్రమం ఆదివారం కొండాలు తొక్కుటతో ముగిసింది. శనివారం సాయంత్రం భారీ భక్త జన సందోహం నడుమ గ్రామ ప్రధాన వీధులలో సరువుల ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం రాత్రి ఆదివాసి నాయక పోడు కుల పూజారులు తమ సంస్కృతి, సాంప్రదాయ, ఆచారాలతో గణాసారులు, దేవర బాలల ఆధ్వర్యంలో  పట్నాలు ఏసి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం పోతురాజు శిరస్సును జలధిలో కలిపి స్నానాలను ఆచరించిన అనంతరం రాజుకి పెద్దమ్మ తల్లికి గ్రామ పేరంటాల నడుమ లేళ్ళ సత్యనారాయణ రెడ్డి, కమలమ్మ దంపతుల కుమారులు లేళ్ళ అప్పిరెడ్డి, నాగిరెడ్డి దంపతులచే అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించారు. అనంతరం రాజు, పెద్దమ్మతల్లి, పోతురాజు, బోనాలతో పూజారులు, గణ బాలలు, దేవర బాలలు, యువకులు, మహిళలు (కొండాలు తొక్కి) అగ్నిగుండంలోనీ నిప్పులపై నడచి, అగ్ని పునీతమై తమ దేవతలపై ఉన్న భక్తిని, నమ్మకాన్ని, తమ ఆచార సాంప్రదాయాలను చాటారు. ఇలా కొలుపు చేయడం ద్వారా గ్రామంలోనీ ప్రజలు, పశువులు, పంటలు వృద్ధి చెంది సుభిక్షంగా ఉండటంతో పాటు, అంటువ్యాధుల భారి నుండి అతివృష్టి అనావృష్టి నుండి ఆ తల్లి కాపాడుతుందని, ప్రతి పనిలో విజయం సాధిస్తామని ఆదివాసీల నమ్మకం. ఆదివారం కొలుపు ముగింపు అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పెద్దమ్మ తల్లి కొలుపు అనంతరం గ్రామస్తులతోపాటు, ఇతర గ్రామాల భక్తులు అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతోపాటు, పరిసర, సుదూర ప్రాంత ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >