| Daily భారత్
Logo




రామన్న గూడెం భూ సమస్య ని పరిష్కరించండి...బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

News

Posted on 2026-03-22 09:27:35

Share: Share


రామన్న గూడెం భూ సమస్య ని పరిష్కరించండి...బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

గిరిజన జిల్లాలో ఆదివాసిలకు తప్పని తిప్పలు 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామస్తులు కొత్తగూడెం కలెక్టరేట్ దగ్గర భూ సమస్య పై నిరాహార దీక్ష చేస్తున్నారు వారికి మద్దతు తెలిపిన బిజెపి నాయకులు,వారు మాట్లాడుతు రామన్నగూడెం గ్రామములో ఉన్న భూ సమస్యకి పరిస్కారం చూపాలని గత 6 రోజులు గా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆదివాసీలు చంటి పిల్లలతో ఊరంతా కలిసి దీక్ష చేస్తున్న కనీసం ఏ అధికారి కూడా స్పందించడం లేదు...గత సంవత్సరం గ్రామస్థులు అందరూ కాలినడకన వచ్చి వారం పది రోజులు దీక్ష చేస్తుంటే మాయమాటలు చెప్పి వెనక పంపించారు,ఈసారి బీజేపీ పార్టీ తరుపున దీక్షకు పూర్తి మద్దతు తెలుపుతుంది అని తెలిపారు,పట్టాలు ఉన్నా భూములు అటవీ అధికారులు వాళ్ళ స్వాధీనంలో ఉంచుకుంటూ గిరిజన జిల్లాలో గిరిజనులను అధికారులే అన్యాయానికి గురిచేస్తున్నారు,ఇ సమస్యను ST కమిషన్ దృష్టికి తీసుకెళ్లి గిరిజన ప్రజల భూములను వారికి అందేలా బీజేపీ పార్టీ నుండి వారికి పూర్తి మద్దతు తెలుపుతూ సమస్యను పరిష్కరిస్తామని,అధికారులు కూడా గిరిజనుల గోడును పరిష్కరించకుండా ఇబ్బందులను గురి చేయడాన్ని ఖండిస్తూన్నాము,సమస్య పరిష్కారానికి అధికారులు సుమోటో గా తీసుకుని ఆదివాసులకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు,

కార్యక్రమంలో రామన్న గూడెం సర్పంచ్ మడకం నాగేశ్వరావు,బీజేపీ నాయుకులు పూనెం నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >