Posted on 2026-02-28 11:33:01
డైలీ భారత్, కాకినాడ: ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం-జి.మేడుపాడు మధ్య భారీ పేలుడు సంభవించింది. ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 18 మందికిపైగా మరణించినట్లు సమాచారం. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
ఘటనా స్తలంలో ఇంకా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాద స్థలంలో ఇంకొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇది స్తానికుల నుంచి అందిన ప్రాథమిక సమచారం. అయితే, మృతులు, క్షతగాత్రుల విషయంలో అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. పేలుడు ధాటికి మృతదేహాలు పొలాల్లోకి ఎగిసిపడ్డాయి. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు సమయంలో అక్కడ 20 మందికిపైగా కార్మికులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు ప్రభావంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఇంకా పేలుడు కొనసాగుతోంది. పరిమితికి మించి బాణాసంచా తయారు చేయడం వల్లే ఈ ఘటన అని ప్రాథమిక అంచనా.
స్థానిక పెదపూడి రోడ్డులోని పొలాల్లో అడపా నాని కుటుంబ సభ్యులు ఒక బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలు అక్కడే ఉండటంతో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మంటలు అదుపులోకి తేవడం కష్టంగా మారింది. భారీ పేలుడు శబ్దాలు రావడంతో స్తానికులు భయాందోళనకు గురయ్యారు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >