| Daily భారత్
Logo




డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల కఠిన చర్యలు

News

Posted on 2026-02-26 17:13:31

Share: Share


డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల కఠిన చర్యలు

ఒకరికి 7 రోజుల జైలు శిక్ష, 12 మందికి జరిమానా

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు ప్రజల ప్రాణ భద్రతను పరిరక్షించడం లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 12 మందిని గుర్తించి, వారి పై కేసులు నమోదు చేసి గౌరవ కోర్టులో హాజరుపరచడం జరిగింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచగా, గౌరవ కోర్టు 12 మందికి జరిమానా విధించడంతో పాటు, ఒక నిందితుడికి 7 రోజుల సాదారణ జైలు శిక్ష విధించింది.

మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం మాత్రమే కాకుండా, అత్యంత ప్రమాదకరమైన చర్య. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగే ప్రమాదాల్లో వాహనం నడిపే వ్యక్తి ప్రాణంతో పాటు, ఇతర నిరపరాధుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి తన కుటుంబం, పిల్లలు మరియు తనపై ఆధారపడిన వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ప్రజలు కేసులు, కోర్టు చర్యలు మరియు జరిమానాల గురించి మాత్రమే ఆలోచించకుండా, స్వచ్ఛందంగా తమ ప్రాణ భద్రత, కుటుంబ భద్రత మరియు సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >