| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా : సిఎంఓ (CMO) అధికారిగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

News

Posted on 2026-02-26 15:50:41

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా : సిఎంఓ (CMO) అధికారిగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

బెట్టింగులు అలవాటు పడి సులభ మార్గంలో డబ్బుల కోసం మోసాలు

నిందుతునిపై పలు జిల్లాలో 10 కి పైగా కేసులు నమోదు

వివరాలు వెల్లడించిన వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి.

డైలీ భారత్, వేములవాడ: రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్ మండలం కుంట్లూర్ ప్రాంతానికి చెందిన రాయబండి సూర్య ప్రకాష్ అనే వ్యక్తి రామోజీ ఫిలిమ్ సిటీ సమీపంలోని ప్రైవేట్ సంస్థల్లో ఆఫీస్ బాయ్‌గా పనిచేసేవాడు.

సూర్య ప్రకాష్ మలక్‌పేట్ ప్రాంతంలో గుర్రపు పందేలపై బెట్టింగ్ ఆడే అలవాటు ఉండటంతో అఫిస్ బాయ్ గా చేసే వస్తే డబ్బులు సరిపడక  ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడలనుకున్నాడు.ఈ క్రమంలో హయత్‌నగర్ పరిధిలో మూడు మోటార్ సైకిళ్లను దొంగిలించగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 

సూర్యప్రకాష్ జైలు నుండి వచ్చిన అనంతరం CMO కార్యాలయంలో పని చేస్తా అంటూ ప్రభుత్వ అధికారులకు ఫోన్ కాల్స్ చేసి బేధరింపులకు పాల్పడటం  ప్రారంభించాడు.ఈక్రమంలో తెల్సిన వార్తాపత్రికల ద్వారా ప్రభుత్వ అధికారుల ఫోన్ నంబర్లు సేకరించి వారికి కాల్ చేస్తూ నేను CMO కార్యాలయం నుండి మాట్లాడుతున్న అంటూ అందరూ అధికారులు డబ్బులు చెల్లిస్తున్నారు మీరు కూడా కట్టాలి అంటూ భయపెట్టి, తన ఫోన్‌పే కు డబ్బు పంపాలని, లేనిపక్షంలో అధికారిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించేవాడు.ఈ విధంగా కొంతమంది ప్రభుత్వ అధికారుల నుండి డబ్బు సేకరించి,ఆ మొత్తాన్ని గుర్రపు పందేల బెట్టింగ్‌లో ఖర్చు చేశాడు.

పై సమస్యలపై సూర్యప్రకాష్ పై  హైదరాబాద్ లోని ccs పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు,హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు,సిద్దిపేట పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు,జగిత్యాల లో ఒక కేసులో  అరెస్ట్ కాబడి, జైలు కి వెళ్లడం జరిగింది.

సూర్యప్రకాష్ తేదీ 23.02.2026 సాయంత్రం బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మిడ్ మానేరు ప్రాజెక్టు డీఈఈ అయిన రఘుపతి కి కాల్.చేసి తాను సిఎంఓ కార్యాలయం నుండి మాట్లాడుతున్నానని డబ్బు డిమాండ్ చేశాడు. అయితే సంబంధిత అధికారి ఎలాంటి డబ్బు చెల్లించకపోగా   బోయినపల్లి పోలీస్ వారిని సంప్రదించగా సూర్యప్రకాష్ పై బోయినపల్లి ఎస్.ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాగా రఘుపతి నుండి నేరుగా డబ్బులు  తీసుకోవడానికి  కొడురుపాకకు వస్తుండగా సాంకేతికత ఆధారంగా బోయినపల్లి పోలీస్ వారు నిందుతున్ని ఈరోజు కోదురుపాక వద్ద అరెస్ట్ చేసి ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించడం జరిగింది అని ఏఎస్పీ రుత్విక్ సాయి తెలిపారు.

నిందుతుని వివరాలు.

1.Rayabandi Surya Prakash Chary, s/o Bhaskarachary, age: 45 yrs,Kuntloor, Hayathnagar, Rangareddy Dist,

నిందుతున్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ రమాకాంత్, కానిస్టేబుల్ కోటి, అచ్యుత్,వెంకటేష్, తేజ లను ఏఎస్పీ అభినందించారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >