| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆల్ ది బెస్ట్ ఇంటర్మీడియట్ విద్యార్థులు : బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు శుభాకాంక్షలు

ఆల్ ది బెస్ట్ ఇంటర్మీడియట్ విద్యార్థులు : బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు శుభాకాంక్షలు

డైలీ భారత్, వైరా: నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా వైరా నియోజకవర్గంలోని విద్యార్థినీ, విద్యార్థులకు వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితంలో ఒక కీలకమైన మలుపు అని పేర్కొన్నారు. మీరు ఏడాది పొడవునా కష్టపడి చదివిన పాఠాలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. పరీక్షల సమయంలో ఆందోళనకు లోనుకాకుండా ప్రశాంతంగా ప్రతి ప్రశ్నకు సమగ్రంగా సమాధానాలు ఇవ్వాలని కోరారు.మీ శ్రమే మీ విజయానికి బాటవేస్తుంది. మంచి ఫలితాలు సాధించి మీ తల్లిదండ్రులకు, గురువులకు గర్వకారణం కావాలి. ఈ పరీక్షలు మీ భవిష్యత్తు లక్ష్యాలకు పునాది రాయిలాంటివి. పట్టుదలతో ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుంది అని తెలిపారు.వైరా నియోజకవర్గంలోని ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

Previous పాఠశాల వాహనం బోల్తా.. విద్యార్థులకు గాయాలు
Next ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే
ADVERTISEMENT