| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శీర్షిక : వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కన్నయ్య

శీర్షిక : వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కన్నయ్య

డైలీ భారత్ స్పెషల్: 

శీర్షిక : వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కన్నయ్య

గోకుల కృష్ణుని మురళీ నాదం

రాధమ్మ ప్రేమలోని ఆనందం

నీ ఆత్మీ య స్పర్శ లేక

రాధమ్మ మూగపోయింది కన్నయ్య..!

నీతో దోబూచులాట ఆటకైనా  రాధమ్మ తనువు పడిగాపులు కాచి…

సొమ్మసిల్లి పోయే కన్నయ్య..!

నీ మధుర మనోహర పిల్లనగ్రోవి

పిలుపు కోసం వేచి వేచి గోపికలు 

సొమ్మసిల్లి పోయినారు  కన్నయ్య..!

మాయలు చాలయ్యా  మధుసూదనా

సందెపొద్దు సూరీడిని కుంకుమ బొట్టుగా దిద్దుకుని కలువకళ్ళతో పంటలేసుకోని దాగుడు మూతల

పరుగులకై నీ కోసం ఎదురు చూస్తున్న 

రాధమ్మ ప్రేమను స్వీకరించు కన్నయ్య..!

రాధా-కృష్ణుల పవిత్ర వివాహం ఫల్గుణ మాసంలోని శుక్ల పక్ష ద్వితీయ తిథి (ఫులేరా దూజ్) Feb 19 నాడు జరిగినట్లు చరిత్ర చెబుతోంది కనుక రాధా-కృష్ణుల ఆశీస్సులు ప్రతీ ఒక్కరి పై ఉండాలని కోరుకుంటూ


రచన: మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218

Previous "కార్మికులు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి" : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్
Next గ్రామపంచాయతీలకు ఫర్నిచర్ అందజేత
ADVERTISEMENT